సీటు బెల్టు పెట్టుకోకపోతే ఇన్సూరెన్స్ క్లయిమ్ రిజక్ట్ అవుతుందా..?

-

రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి. ఒక పొరపాటు చాలు ప్రమాదం పొంచిరావడానికి. టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ మరణించిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి ఎన్నో సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే మనం క్షేమంగా ఉండాలంటే సీట్ బెల్ట్ ని తప్పక పెట్టుకోవాలి.

వెనుక సీట్లలో కూర్చున్న వారికి కూడా సీట్ బెల్ట్ తప్పని సరి అని ప్రభుత్వం కూడా అంటోంది. అయితే రోడ్డు ప్రమాదం మానవ తప్పిదం వల్ల జరిగి ఎవరైనా ప్రాణాలు కోల్పోయినా, ఎవరికైనా గాయాలైనా ఇన్సూరెన్స్ క్లయిమ్స్ వస్తాయా అనేదే ప్రశ్న. మరి ఇక ఇప్పుడు దాని కోసమే తెలుసుకుందాం. ఎవరైనా ప్రమాదంలో పడిన సమయంలో వారిని సంరక్షించేందుకు ఇన్సూరెన్స్‌ను కంపెనీలు ఆఫర్ చేస్తాయి.

అయితే అది మానవ తప్పిదం వల్ల కానీ ఇతర కారణాల వలన కానీ జరిగినా ఇన్సూరెన్స్ పాలసీ వర్తిస్తుందని నిపుణులు అంటున్నారు. రూల్స్‌ను అనుసరించకపోయినా ఇన్సూరెన్స్ పాలసీ నుంచి పూర్తి ప్రయోజనాలు వస్తాయి. అరుదైన కేసుల్లో మాత్రమే ఈ పరిహారాల మొత్తం తగ్గుతుందని అంటున్నారు. సమగ్రమైన మోటార్ ఇన్సూరెన్స్ పాలసీని ఎవరైనా తీసుకుంటే అప్పుడు వెహికిల్‌కు డ్యామేజ్ అయినా కూడా కంపెనీలు చెల్లిస్తాయి. అంతే కానీ సీటు బెల్టు పెట్టుకోకపోతే ఇన్సూరెన్స్ క్లయిమ్ రిజక్ట్ మాత్రం అవ్వదు

 

Read more RELATED
Recommended to you

Exit mobile version