ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి సవాళ్ల వర్షం కురిపించారు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. పల్నాడు జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 175 నియోజకవర్గాల్లో పోటీ చేసే దమ్ముందా? అని ప్రశ్నిస్తున్న జగన్ రెడ్డికి ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలకు వెళ్లే దమ్ము ఉందా? అంటూ సవాల్ విసిరారు.
“151 సీట్లలో మీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను మళ్ళీ పోటీ చేయించే దమ్ముందా? ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెల ఒకటో తేదీ జీతాలు ఇచ్చే దమ్ముందా? వైకాపాతో పొత్తుకు ఎవరు ముందుకు రారు..! జగన్మోహన్ రెడ్డి ది నియంత్రత్వ, నియంత పాలన” అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. టిడిపి ప్రజా పాలన అందిస్తుందనే నమ్మకంతోనే పొత్తుకు అందరూ ముందుకు వస్తున్నారని తెలిపారు. పీఎం కిసాన్ పథకం తో ముందు రోజే నగదు రైతుల ఖాతాలలో వేస్తే , తెనాలి వెళ్లి నగదు బటన్ నొక్కినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఆర్.బి.కె కేంద్రాలు రైతు దగా కేంద్రాలుగా మారాయని ఆరోపించారు. జగనన్న కాలనీలు సమస్యల నిలయాలుగా మారాయన్నారు.