లఢాక్‌లోని గాల్వన్ లోయలో 20 మంది భారత జవాన్లను చైనా ఆర్మీ దారుణంగా హతమార్చిన అనంతరం దేశంలో పెద్ద ఎత్తున యాంటీ చైనా ఉద్యమం మొదలైంది. చైనాకు చెందిన వస్తువులను వేటినీ వాడవద్దని జనాలు నిర్ణయించుకున్నారు. ఇక భారత నిఘా వర్గాలు చైనాకు చెందిన, చైనాతో సంబంధం ఉన్న 52 యాప్‌లను వాడకూడదని ఓ జాబితాను విడుదల చేశాయి. అయితే భారత్‌లో అత్యధిక సంఖ్యలో యూజర్లు పబ్‌జి గేమ్‌ను ఆడుతున్న దృష్ట్యా.. ఈ గేమ్‌ను కూడా చాలా మంది చైనాకు చెందిన గేమ్ అని భావిస్తున్నారు. అయితే ఇందులో నిజమెంత ? ఇది నిజంగా చైనాకు చెందినదేనా ? దీన్ని బ్యాన్ చేయాలా ? అంటే..
పబ్‌జి గేమ్ చైనాకు చెందినది కాదు. దక్షిణ కొరియాకు చెందిన బ్లూహోల్ అనే కంపెనీ దీన్ని డెవలప్ చేసింది. అయితే ఈ గేమ్ మొదట్లో పీసీ, ప్లే స్టేషన్ వెర్షన్లలో అందుబాటులో ఉండేది. దీన్ని మొబైల్ ప్లాట్‌ఫాంపైకి తీసుకువచ్చేందుకు చైనాకు చెందిన టెన్సెంట్ గేమ్స్ అనే కంపెనీ బ్లూ హోల్‌కు సహాయం చేసింది. ఈక్రమంలో టెన్సెంట్ గేమ్స్.. బ్లూ హోల్‌లో 10 శాతం వాటాను తీసుకుంది. అంతే.. అంతకు మించి ఈ గేమ్ యాప్‌తో చైనాకు అసలు సంబంధమే లేదు.
ఇంకా నిజంగా చెప్పాలంటే.. చైనాకు చెందిన టెన్సెంట్ గేమ్స్ ఈ గేమ్‌ను మొబైల్ ప్లాట్‌ఫాంపైకి తీసుకువచ్చినా.. వారు చైనాలోనే ఈ గేమ్‌ను లాంచ్ చేయలేకపోయారు. కారణం.. ఇందులో విపరీతమైన హింస ఉందని, దాని వల్ల పిల్లలు, యువత తప్పుదోవ పడతారని చెప్పి చైనా ప్రభుత్వమే ఈ గేమ్‌ను అక్కడ బ్యాన్ చేసింది. దీంతో టెన్సెంట్‌కు దిక్కులేక దీన్ని భారత్‌తోపాటు ఇతర దేశాల్లో లాంచ్ చేసింది. ఈ క్రమంలో మన దగ్గర ఈ గేమ్ బాగా హిట్ అయింది. అంతేకానీ.. ఈ గేమ్‌కు, చైనాకు అసలు సంబంధమే లేదు. కానీ కొందరు దీన్ని చైనీస్ గేమ్ యాప్ అని కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. కనుక అలాంటి వారు పైన తెలిపిన నిజాన్ని కచ్చితంగా తెలుసుకోవాలి.