బ్రేక్ఫాస్ట్ మానేస్తే.. బరువు తగ్గిపోవచ్చా..?

-

అధిక బరువు సమస్య తో బాధపడే వాళ్ళు బ్రేక్ ఫాస్ట్ ని మానేస్తే బరువు తగ్గిపోవచ్చని అనుకుంటూ ఉంటారు. మరి నిజంగా అల్పాహారం తీసుకోకపోతే బరువు తగ్గిపోవచ్చా..? అందులో నిజం ఏంటి..? నిపుణులు ఏం చెప్తున్నారు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం… కొన్ని అధ్యయనాల ప్రకారం అల్పాహారం మానేస్తే మన శరీర జీవ గడియారం బరువు పెరగడానికి ఒక సంకేతాన్ని పంపుతుంది ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ ని కనుక స్కిప్ చేస్తే రోజంతా ఎక్కువ తినేలా చేస్తుంది.

డిన్నర్ చేసిన తర్వాత ఎక్కువ గ్యాప్ వస్తుంది. గ్యాప్ తర్వాత బ్రేక్ఫాస్ట్ ని తీసుకోవాలి ఇది చేయకపోవడం వలన శక్తి ఉండదు. శక్తిని కోల్పోతారు. ఆకలి వేయడం వలన ఎక్కువ పని చేయడం అవ్వదు. రోజంతా కూడా ఇబ్బందిగా ఉంటుంది. మెదడు సక్రమంగా పనిచేయదు కాబట్టి కచ్చితంగా అల్పాహారాన్ని తీసుకోవాలి. ఎముకలకు, కీళ్ళకు, కండరాలకు శక్తిని ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ ని తీసుకోవాలి.

బరువు తగ్గాలనుకునే వాళ్ళు బ్రేక్ ఫాస్ట్ మానేయడం మంచిది కాదు ఇలా అల్పాహారాన్ని స్కిప్ చేస్తే లంచ్ డిన్నర్ లో ఎక్కువ క్యాలరీలనే తీసుకుంటూ ఉంటారు దాంతో బరువు పెరిగిపోతారు. పైగా అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. ప్రోటీన్స్ మినరల్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. అల్పాహారం సమయంలో తాజా పండ్లు పప్పులు, పాలు ఎక్కువ తీసుకోవాలి. అలానే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను కూడా అల్పాహారం టైం లో తీసుకోవాలి అంతే కానీ బరువు ఎక్కువగా ఉన్నామని బ్రేక్ ఫాస్ట్ ని స్కిప్ చేయడం మంచి అలవాటు కాదు మీరు కనుక బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేస్తున్నట్లయితే ఆ అలవాటుని మానుకోండి. రోజూ కచ్చితంగా అల్పాహారాన్ని సమయానికి తీసుకోండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version