తెలంగాణ మందుబాబులకు ఎదురు దెబ్బ తగిలింది. ఇటీవల బీర్లపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ధరలు పెంచగా… ఆ షాక్ నుంచి కోలుకోక ముందే మరో షాక్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజులపాటు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. ఈనెల 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు… తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మద్యం దుకాణాలు మూతపడబోతున్నాయి.

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది ఎన్నికల సంఘం. ఇక ఎన్నికల సంఘం నిర్ణయం మేరకు తెలంగాణ ప్రభుత్వం ఈ ఆదేశాలను జారీ చేసింది. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్, అదిలాబాద్ నాలుగు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికల పోలింగ్ ఈనెల 27వ తేదీన జరగనుంది. అందుకే… వైన్స్ మూసివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.