వైరల్‌ వీడియో : ధోని కుక్కకు కూడా కీపింగ్ నేర్పించాడా…?

-

కుక్కలు మానవులకు మంచి స్నేహితులు అని అంటూ ఉంటారు. మనుషుల బాషను, బాధను అర్ధం చేసుకుంటూ ఉంటాయి. వారితో పాటుగా సందడి చేస్తూ తమ వంతు సహకారం అందిస్తూ ఉంటాయి. ఇక వారితో పాటుగా తోడుగా ఉంటూ ఆహ్లాదాన్ని అందిస్తూ ఉంటాయి. ఇక ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియో లో కుక్క క్రికెట్ ఆడుతుంది.

ప్రముఖ నటి, టాక్ షో హోస్ట్ సిమి గరేవాల్ పాత వీడియోను షేర్ చేశారు, ఇది సోషల్ మీడియాలో మరోసారి సంచలనం సృష్టిస్తోంది. సిమి షేర్ చేసిన 44 సెకన్ల వీడియోలో, పెంపుడు జంతువులైన కుక్కలు పిల్లలతో క్రికెట్ ఆడుకోవడం చూడవచ్చు. వికెట్ కీపర్ గా ఆ కుక్క చేస్తున్న సందడి, అంతా ఇంతా కాదు. బాల్ కోసం పరిగెత్తడం కీపర్ గా సేవలు అందించడం మనం చూడవచ్చు. వీడియోలో, స్టంప్స్ వెనుక ఉన్న కుక్క, బంతి కదలికను చురుకుగా కదులుతుండగా,

ఒక అమ్మాయి బ్యాటింగ్ చేయడాన్ని మనం చూడవచ్చు. అమ్మాయి బంతిని కొట్టగా, కుక్క బంతి వైపు పరుగెత్తుతుంది మరియు దానిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. వీడియోను పంచుకున్న సిమి, “సంవత్సరపు ఉత్తమ ఫీల్డర్‌కు అవార్డు !!” ఇచ్చారు. గురువారం రాత్రి సిమి షేర్ చేసిన ఈ వీడియోకు వేలాది లైక్‌లు, రీ ట్వీట్లు వచ్చాయి. ఈ కుక్క భారత మాజీ క్రికెట్ కెప్టెన్ ఎంఎస్ ధోని పెంపుడు జంతువు అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version