రాంచరణ్ కు షాక్.. గేమ్ ఛేంజర్ సినిమాపై కేసు !

-

రాంచరణ్ కు షాక్.. గేమ్ ఛేంజర్ సినిమాపై కేసు పెట్టేందుకు కొందరు ముందుకు వచ్చారు. రాంచరణ్ గేమ్ ఛేంజర్ సినిమా టీం తమను మోసం చేసిందని పోలీస్ స్టేషన్ లో ఆర్టిస్టులు ఫిర్యాదు చేశారు. గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ కోసం గుంటూరు, విజయవాడ నుండి హైదరాబాద్ కి 350 మంది వెళ్లామని చెబుతున్నారు.

Artist Tarun complained to the Guntur police station that 350 people went to Hyderabad from Guntur and Vijayawada for the shooting of the Game Changer movie, and the co-director Swargam Siva agreed to give them Rs.1200 but did not pay the money.

కో డైరెక్టర్ స్వర్గం శివ తమకు రూ.1200 ఇస్తానని ఒప్పుకొని డబ్బులు ఇవ్వట్లేదని గుంటూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఆర్టిస్ట్ తరుణ్. గేమ్ ఛేంజర్ సినీ నిర్మాత దిల్ రాజు తమకు న్యాయం చేయాలని, మోసం చేసిన స్వర్గం శివపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఆర్టిస్టులు. ఇప్పుడు ఈ సంఘటన హాట్‌ టాపిక్‌ అయింది. దీనిపై గేమ్ ఛేంజర్ సినీ నిర్మాత దిల్ రాజు ఎలా రియాక్ట్‌ అవుతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version