ఇప్పుడు కరోనా తీవ్రత మరింత ఎక్కువ అయిపోయింది. ఇటువంటి సమయం లో మనం శ్వాస మీద మరియు ఇమ్యూనిటీ మీద ధ్యాస పెట్టడం ఎంతైనా అవసరం ఉంది. ఇలా చేయడం వల్ల ఎన్నో రకాల లాభాలు కూడా వస్తాయి.
అయితే ఈ రోజు సూర్య నమస్కారాలు మరియు కొన్ని వ్యాయామాల గురించి చూద్దాం. ఈ వ్యాయామాలు చేయడం వల్ల బరువును అదుపులో ఉంచుకోవడం మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచిది. ఒత్తిడి నుంచి కూడా మంచి రిలీఫ్ వస్తుంది. నెమ్మదిగా యోగాని ప్రాక్టీస్ చేయాలి.
బ్రీతింగ్ ఎక్సర్సైజ్:
నెమ్మదిగా శ్వాస తీసుకోవడం మరియు నెమ్మదిగా వదలడం చేస్తూ ఉండాలి అలానే కొద్దిసేపు శ్వాసతీసుకోవడం ఆపేసి ఆ తర్వాత కొద్ది సేపట్లో మళ్ళీ తీసుకోవాలి. సామర్థ్యాన్ని బట్టి మీరు దీనిని ప్రయత్నం చేయండి.
సూర్య నమస్కారాలు:
యోగాలో సూర్య నమస్కారాలు చాలా ముఖ్యం. ఇది ఫిజికల్ గా మరియు మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. కానీ కొద్ది మందికి మాత్రమే సరిగ్గా సూర్య నమస్కారాలు చేయడం వచ్చు.
ప్రాణం ఆసనం:
దీనికోసం మీరు మీ మ్యాట్ చివరలో రెండు కాళ్ళు పెట్టి రెండు చేతులు ఒకేసారిగా భుజం పై నుంచి ఎత్తి రెండు కాళ్ళ మీద సమానమైన బరువు పెట్టాలి. ఇలా నమస్కారం పోస్టర్లో మీరు చెయ్యాల్సి ఉంటుంది.
హస్తపాద ఆసనం:
దీనికోసం మీరు గట్టిగా శ్వాస తీసుకుని రెండు చేతులు పైకి ఎత్తి ఇప్పుడు చేతుల్ని బెండ్ చేసేటప్పుడు మెడను కూడా వెనక్కి వంచాలి. ఇది చేసేటప్పుడు మీరు మెల్లగా ముందుకు వంగాలి అలానే మీ రెండు చేతులను కూడా చెవుల వద్దకి తీసుకెళ్లండి ఆ తర్వాత నేలని తాకండి.
శవాసనం:
దీనికోసం మీరు పూర్తిగా కింద పడుకుని కళ్లు మూసుకోవాలి మీ పాదాలను రిలాక్స్ గా ఉంచండి చేతులను ఇరపక్కలా పెట్టి ప్రశాంతంగా కళ్లు మూసుకుని ఆ పోస్టర్ లో రెస్ట్ తీసుకోండి.
అలానే మీరు అశ్వ సంచాలన ఆసనం పర్వతాసనం కూడా వేయొచ్చు. దీనివల్ల కూడా మంచి ఫలితాలు కనపడతాయి. ప్లైన్క్ పోస్టర్ లో కూడా మీరు కాసేపు ఉంటే మీ కేలరీలు తగ్గుతాయి మరియు ఆక్సిజన్ ఎక్కువగా తీసుకోవడానికి వీలవుతుంది. ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఈ ఆసనము మంచిది.