ఈ మధ్యకాలంలో హృదయ సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. సరైన జీవన విధానం లేకపోవడం వల్ల డయాబెటిస్, హైబీపీ, కొలెస్ట్రాల్ మొదలైన సమస్యలు వస్తున్నాయి. కనుక ఆరోగ్యకరమైన పద్ధతులు పాటించి ఏ సమస్యలు లేకుండా జాగ్రత్త పడాలి. ఈ మధ్య కాలంలో యువత కూడా గుండె సమస్యల బారిన పడుతున్నారు.
రిపోర్ట్ ప్రకారం నలభై ఏళ్ల కంటే తక్కువ వయస్సు వున్నవారు సుమారు 62 మిలియన్ల మంది హృదయ సమస్యలతో సతమతమవుతున్నారు. అయితే ఈ సమస్యలు వల్ల ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా ఉండాలంటే కచ్చితంగా ప్రతి రోజు వీటిని పాటించండి. మరి ఆలస్యం ఎందుకు వాటి గురించి ఇప్పుడు మనం చూద్దాం.
బరువుని చెక్ చేసుకుంటూ ఉండండి
అధిక బరువు ఉండటం వల్ల చాలా సమస్యలు వస్తాయి. అధిక బరువు వల్ల హృదయ సంబంధిత సమస్యలు ఎక్కువ అవుతాయి. అలాగే డయాబెటిస్ మొదలైన సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి బరువుని అదుపులో ఉంచుకొని రెగ్యులర్ గా బరువుని చెక్ చేసుకుంటూ ఉండండి.
వ్యాయామం
వ్యాయామం ఆరోగ్యానికి చాలా మంచిది. హృదయ సంబంధిత సమస్యలు రాకుండా ఉండాలంటే కచ్చితంగా వ్యాయామం చేయాలి. కాబట్టి ప్రతి రోజూ మీ సమయంలో కాస్త సమయాన్ని వ్యాయామానికి కేటాయించండి. దీనితో సమస్యలు ఉండవు.
ఫైబర్
ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యం బాగుంటుంది. అలానే హృదయ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. ఓట్ మీల్, బ్రౌన్ రైస్, బీన్స్ మొదలైనవి ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. హార్ట్ ఎటాక్ మరియు స్ట్రోక్ కూడా దీని వల్ల తగ్గుతాయి.
మంచి నిద్ర
నిద్ర కూడా అవసరం, హైబిపి సమస్యని ఇది తగ్గిస్తుంది. అలానే స్ట్రోక్, డయాబెటీస్ కూడా తగ్గుతుంది. కొలెస్ట్రాల్, బిపి కూడా కంట్రోల్లో ఉంటాయి. కాబట్టి ఎక్కువసేపు నిద్రపోండి.