ఏపీలో భారీ పెట్టుబడులు..రూ. 1,750 కోట్లతో ఎలక్ట్రిక్‌ వెహికిల్ కంపెనీ

-

ఏపీలో భారీ పెట్టుబడి మరో సంస్థ ముందుకు వచ్చింది. ఇందులో భాగంగానే… ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను క్యాంప్‌ కార్యాలయం లో కైనెటిక్‌ గ్రీన్‌ ఎనర్జీ అండ్‌ పవర్‌ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌ ఫౌండర్‌ అండ్‌ సీఈవో సులజ్జ ఫిరోదియా మొత్వాని, కో–ఫౌండర్‌ రితేష్‌ మంత్రి కలిశారు.

ఏపీ లో రూ. 1,750 కోట్లతో ఎలక్ట్రిక్‌ టూ వీలర్స్, త్రీ వీలర్స్, అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్, బ్యాటరీ స్వాపింగ్‌ స్టేషన్స్‌ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది కైనెటిక్‌ గ్రీన్‌ ఎనర్జీ. విశాఖలో బ్రాండెడ్‌ ప్రీమియం ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ నెలకొల్పేందుకు ఆసక్తి కనపరిచింది కైనెటిక్‌ గ్రీన్‌ ఎనర్జీ.

స్కిల్‌ డెవలప్‌మెంట్, రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది కైనెటిక్‌. ఇప్పటికే పూణే సమీపంలోని అహ్మద్‌నగర్‌లో నెలకు 6,000 ఎలక్ట్రిక్‌ వాహనాల ఉత్పత్తి సామర్ధ్యంతో కల ప్లాంట్‌ని ఏర్పాటు చేసింది కైనెటిక్‌. ఇందులో భాగంగానే… కంపెనీ ప్రణాళికలను సీఎం జగన్‌కు వివరించారు ఆ ప్రతినిధులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version