గిరిజన ప్రాంతంలో డోలీ కష్టాలు.. వైద్యం ఆలస్యమై మహిళ మృతి

-

గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు డోలీ కష్టాలు మాత్రం తప్పడం లేదు. ప్రభుత్వాలు ఎన్ని మారినా వారికోసం మౌలిక సదుపాయాల కల్పన మాత్రం జరగడం లేదు. గిరిజిన ప్రాంతాల్లో రోడ్లు, సరైన తాగునీరు, వైద్యం అందుబాటులో లేకపోవడంతో ఎవరైనా అనారోగ్యం బారిన పడితే వారికి డోలీ సాయంతో కిలోమీటర్ల మేర నడిచి వెళ్లి ట్రీట్మెంట్ చేయించాల్సి వస్తోంది.

ఫలితంగా వైద్యం అందక తాజాగా మరో మహిళ మృతి చెందింది. ఈ ఘటన ఏపీలోని అల్లూరి జిల్లా అనంతగిరి మండలం, గుమ్మా పంచాయతీలోని కర్రిగూడలో గురువారం ఆలస్యంగా వెలుగుచూసింది.అనారోగ్యంతో సుక్రమ్మ అనే మహిళ ప్రాణాలు కోల్పోవడంతో బాధిత కుటుంబీకులు పెద్ద ఎత్తున విలపించారు.తమ డోలీ కష్టాలను తీర్చాలని స్థానికులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతొంది.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news