ప్రస్తుతం కరోనా మహమ్మారి వల్ల దేశదేశాలు లాక్‌డౌన్ అయిన సంగతి తెలిసిందే. చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైరస్ ప్రపంచదేశాల ప్రజలను బలి తీసుకుంటుంది. ఇప్పటికే కరోనా మృతుల సంక్ష్య 80 వేలు దాటగా.. పాజిటివ్ కేసులు సంఖ్య 15 లక్షలు దాటింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇక లాక్‌డౌన్ కారణంగా ఇంటిపట్టునే ఉంటున్నారు. ఇక నిత్యాసరాలకు మాత్రమే బయటకు వస్తున్న పరిస్థితి . ఇక ఈ సమయంలో కరెంట్ బిల్లులు మూడు నెలల పాటు చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్రం మూడు నెలల మారటోరియం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ కు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇదే సమయంలో కరెంట్ బిల్లు లెక్కించే విషయంలో కూడా ఇళ్ళకి వెళ్ళకుండానే లెక్కించాలని నిర్ణయం తీసుకుంది. ఏపీలోనూ కరెంటు బిల్లుల చెల్లింపులకు కరోనా చిక్కొచ్చిపడడంతో డబ్బులు కట్టకుండా ఆగిపోయారు. అయితే అధికారులు మాత్రం నిర్ణీత సమయంలోగా కరెంట్ బిల్లు కట్టాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో అపరాధరుసుం మాఫీ అంశాన్ని పరిశీలిస్తామంటున్నారు.
లాక్‌డౌన్ కారణంగా విద్యుత్ ఉద్యోగులు కూడా కరెంట్ మీటర్ రీడింగ్ కోసం రావడం లేదు. ఫిబ్రవరిలో జరిగిన విద్యుత్ వినియోగం ఆధారంగానే మార్చి బిల్లులు ఇచ్చారు. ఏప్రిల్ నెలలో కూడా ఇంతే అమౌంట్‌ను చెల్లిస్తే సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. అది కూడా నిర్ణీత గడవులోనే కట్టాలని అంటున్నారు. మూడు నెలలపాటు కరెంట్ బిల్లులు కట్టకపోయినా పర్లేదని కొందరు అపోహపడుతున్నారని.. బిల్లులు చెల్లించకపోతే పెనాల్టీలు వేయడంతో పాటు కనెక్టన్ కట్ చేస్తామని విద్యుత్ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రజలు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.