ఈనెల 5 జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో తదుపరి అమెరికా అధ్యక్షుడిగా వచ్చే ఏడాది జనవరి 20వ తేదీన డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుత ప్రెసిడెంట్ జో బైడెన్‌తో బుధవారం డొనాల్డ్ ట్రంప్ భేటీ అయ్యారు.
వైట్‌హౌస్‌లోని అధ్యక్షుడి కార్యాలయం ఓవల్ ఆఫీసులో అధ్యక్షుడు, కాబోయే అధ్యక్షుడు ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు. ట్రంప్‌తో కరచాలనం చేసిన బైడెన్ ఎన్నికల్లో విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు. ఇక అధికార మార్పిడి ప్రక్రియ సాఫీగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఈ సందర్భంగా బైడెన్ ట్రంప్‌తో చర్చించినట్లు తెలిసింది.