వైఎస్ జగన్‌కు షర్మిల కౌంటర్ ఇచ్చారు. జగన్ తీరు ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుంది అంటూ సెటైర్ వేశారు వైఎస్ షర్మిల. కాంగ్రెస్ ఓ ఇన్‌సిగ్నిఫికెంట్ పార్టీ అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై షర్మిల రియాక్ట్ అయ్యారు. 38% ఓట్ షేర్ వచ్చినా.. అసెంబ్లీకి వెళ్లని వైసీపీ ఒక ‘ఇన్‌సిగ్నిఫికెంట్ పార్టీ’ అంటూ ఎద్దేవా చేశారు వైఎస్ షర్మిల. ప్రజలు ఓట్లేసింది ఇంట్లో కూర్చోడానికి కాదు.. అసెంబ్లీలో మాట్లాడ్డానికి అంటూ మండిపడ్డారు వైఎస్ షర్మిల.
ప్రతిపక్షం కాకపోయినా.. ఉన్న 11 మందే ప్రజాపక్షం అనిపించుకోండని చురకలు అంటించారు. ఇప్పటికీ అసెంబ్లీకి వెళ్ళే దమ్ము లేకుంటే.. రాజీనామాలు చేయండంటూ ట్వీట్ చేశారు వైఎస్ షర్మిల. వైసీపీ ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలని… లేదా దమ్ముంటే అసెంబ్లీకి వెళ్లి బడ్జెట్ మీద చర్చించాలని కోరారు. చంద్రబాబు గారి సూపర్ సిక్స్ పథకాలకు నిధుల కేటాయింపుపై నిలదీయండి అన్నారు. ఎన్నికలకు వెళ్ళండి. అప్పుడు ఎవరు ఇన్ సిగ్నిఫికెంట్.. ఎవరు ఇంపార్టెంట్ తేలుతుంది కదా.. అంటూ సవాల్ విసిరారు.