సొంత కుటుంబ సభ్యులు తమ ఆలనా పాలన మరిచిపోతే.. సీఎం కేసీఆర్ తమకు పెద్ద కొడుకులా మారి పెన్షన్ ఇస్తున్నారని వృద్ధులు పేర్కొంటున్నారు. అలాగే ఒంటరి మహిళలు, వికలాంగులతో పాటు ఆసరా పెన్షన్లు అందుకునే వారు తెలంగాణ సీఎం కేసీఆర్ పై ప్రత్యేక అభిమానాన్ని ప్రదర్శించడం గమనిస్తుంటాం. గత అసెంబ్లీ ఎన్నికలో పెన్షన్ దారులు ఏకపక్షంగా బీఆర్ఎస్ పార్టీకే ఓట్లు వేయడంతో ఆ పార్టీ మేజార్టీ సాధించిందనే ప్రచారం కూడా జరిగింది.
ఈసారి పెన్షన్ దారుల మద్దతు కేసీఆర్ కే లభించేవిధంగా కనిపిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ నామినేషన్ కోసం తమ ఫెన్షన్ డబ్బులు విరాళంగా ఇచ్చి మద్దతు ప్రకటించారు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కొందరూ పెన్షన్ దారులు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా(కె) గ్రామానికి చెందిన దాదాపు 100 మంది పెన్షన్ దారులు కేసీఆర్ నామినేషన్ కోసం పెన్షన్ డబ్బులు విరాళంగా ప్రకటించారు. ఒక్కొక్కరూ రూ.1000 చొప్పుల వంద మంది కలిపి లక్ష రూపాయలు జమా చేశారు. తమ పెన్షన్ డబ్బులను జమ చేసి గ్రామ సర్పంచ్ మీనాక్షికి అందజేశారు. ఈ డబ్బులు కేసీఆర్ కి అందించాలని పెన్షన్ దారులు సర్పంచ్ ని కోరారు.