బస్సు ప్రయాణికులకు బిగ్ అలెర్ట్.. టీ-9 టికెట్లను నిలిపివేసిన టీఎస్ఆర్టీసీ

-

పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణికుల కోసం జారీ చేసే టీ-9 టికెట్లను నిలిపివేస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రకటించింది. రాఖీ పౌర్ణమికి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా టీ-9 టికెట్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు TSRTC వెల్లడించింది. రేపటి నుంచి అనగా ఆగస్టు 29 నుంచి నాలుగు రోజుల పాటు నిలుపుదల అమలులో ఉంటుందని తెలిపింది. సెప్టెంబర్ 02 నుంచి ఈ టికెట్లు యదాతథంగా కొనసాగుతాయని ఆర్టీసీ యాజమాన్యం స్పష్టంచేసింది.

పల్లె వెలుగు బస్సులో ప్రయాణికులకు టీ-9 పేరుతో రెండు టికెట్లను సంస్థ జారీ చేస్తుంది. 60 కిలో మీటర్ల పరిధిలో రాను పోను ప్రయాణానికి టీ-9 60 ని, 30 కిలోమీటర్లు టీ-9 30ని అందుబాటులోకి తీసుకొచ్చింది. టీ-9 60 టికెట్ కి రూ.100, టీ-9 30 టికెట్ కి రూ.50కిప్రయాణికులకు అందజేస్తుంది. టీ-9 టికెట్ ను రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని రద్దు చేస్తున్నట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. రాఖీ పౌర్ణమికి బస్సుల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో టీ-9 టికెట్ ను మంజూరు చేయడం సిబ్బందికి చాలా కష్టం అనే చెప్పాలి. టికెట్ల జారీకి ప్రయాణికుడు జెండర్, వయస్సు వంటి వివరాలను టిమ్ మిషన్లలో నమోదు చేయాల్సి ఉంటుంది. రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో అందుకు చాలా సమయం తీసుకునే అవకాశముంది. ఈ తరుణంలో టీ-9 టికెట్లను తాత్కాలికంగా నిలుపుదల చేయాలని ఆర్టీసీ సంస్థ నిర్ణయించింది. 

Read more RELATED
Recommended to you

Exit mobile version