వాస్తు టిప్స్: ఇంటి పైకప్పుపై పనికిరాని వస్తువులను పడవేస్తున్నారా? ఇది తెలుసుకోండి.

-

వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతీ దానికీ ఓ లెక్కుంది. ఇల్లు కట్టుకోవడం దగ్గర నుండి, ఇంట్లో ఉంచుకునే వస్తువుల వరకు ఏ దిక్కున ఏది ఉంచితే మంచిది అన్న విషయాలు కనిపిస్తాయి. వాస్తు మీద నమ్మకం ఉన్న వారందరూ వీటిని పాటించడానికి ఇష్టపడతారు. ఎవరి నమ్మకాలు వారివి కాబట్టి, ఎవరి ఇష్టాలు వారివి. ఐతే ఇంట్లో ఉన్న వస్తువులు ఎక్కడ ఏది పెట్టుకోవాలనేది ప్రతీ ఒక్కరూ చెబుతుంటారు. సోఫా ఎటువైపు ఉంటే బాగుంటుంది. బీరువా ఎక్కడ ఉండాలి? రిఫ్రిజిరేటర్ ఏ మూలన ఉంచాలి తదితర అంశాలు చర్చకి వస్తుంటాయి.

కానీ ఇంటి పైకప్పుపై ఎలాంటి వస్తువులను ఉంచాలనేది చర్చకు రాని అంశం. ఇంటి పైకప్పు మీద రకరకాల వస్తువులను పడవేస్తుంటారు. ముఖ్యంగా పనికిరాని వస్తువులన్నింటినీ పైకప్పు మీద పడవేస్తారు. ఇలా చేయడం వాస్తు పరంగా కరెక్ట్ కాదు. వాస్తు శాస్త్రజ్ఞుల ప్రకారం ఇంటి పైకప్పు మీద పనికి రాని వస్తువులను పడవేయడం శుభప్రదం కాదు. ఇంట్లోని వారి అది ప్రతికూల ప్రభావం చూపి, అనేక ఇబ్బందులను తీసుకువచ్చే అవకాశం ఉంది.

కుటుంబ సభ్యుల మీద చెడు ప్రభావం చూపుతుందని వాస్తు శాస్త్రం చెబుతుంది. అలాగే పితృ దోషానికి కారణం అవుతుంది. ఇంటి వాతారవణం దెబ్బతిని అనేక ఇబ్బందులను తెచ్చి పెడుతుందని చెబుతున్నారు. అందువల్ల పనికి రాని వస్తువులను గానీ, పనికొచ్చే వస్తువులు ఉండి, వాడకుండా వదిలేసిన వస్తువులను గానీ ఇంటిపైకప్పు ఉంచకపోవడమే ఉత్తమం అని సూచిస్తున్నారు. ఇంట్లో ఉండే వస్తువులే కాదు ఇంటి పైకప్పు మీద పడవేసే వస్తువులు కూడా వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి వాతావరణంపై ప్రభావాన్ని చూపిస్తాయన్నమాట.

Read more RELATED
Recommended to you

Exit mobile version