ఏపీలో జగన్ కు ప్రజల్లో వ్యతిరేకత స్టార్ట్ అయ్యిందని ప్రతిపక్షాలు పైకి చెబుతున్నా.. వాస్తవాలు అందుకు విరుద్దంగా ఉన్నాయని వైకాపా నేతలు చెబుతుంటారు! ఆ సంగతులు అలా ఉంటే… జగన్ పై జనాల్లో వ్యతిరేకత వచ్చిందో లేదో తెలియదు కానీ… వైకాపా నేతల్లో మాత్రం వచ్చినట్లే ఉంది! ప్రస్తుతం వైకాపాకు రోజురోజుకీ చాపకిందనీరులా విస్తరిస్తున్న ఇంటి సమస్య ఇదే!
అవును… ఒకరు కాదు ఇద్దరు కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఎమ్మెల్యేల్లో చాలా మంది అసహనంతో రగిలిపోతున్నారు. నెల్లూరుకు చెందిన మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి.. జగన్ కు అత్యంత వీర విధేయుడుగా ఉన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దీంతో… సమస్య తీవ్రరూపం దాల్చుతుందనే భావన వ్యక్తమవుతుంది.
ఆనం రామనారాయణ రెడ్డి.. ప్రభుత్వంపై విమర్శలు చేశారంటే దాన్ని పెద్ద సమస్యగా వైకాపా బావించి ఉండకపోవచ్చు. సీనియర్ అయిన తనను కాదని అనీల్ కుమార్ ని మంత్రిని చేసిన విషయంలో.. కాస్త గుస్సా ఉండొచ్చని సరిపెట్టుకోవచ్చు. కానీ… జగన్ ఫ్యాన్ బెల్ట్ లో ఒకరైన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ప్రభుత్వంపై విరుచుకుపడం అనేది చిన్న సమస్య కాదు. ఈ విషయంలో జగన్ దృష్టి సారించాల్సిన అవసరం ఎంతనా ఉంది.
గడిచిన ఏడాది కాలంగా నిధులు ఇవవ్వడం లేదు.. తన నియోజకవర్గంలో చేసిన పనులకు సంబంధించి ప్రభుత్వం నుంచి కోట్ల రూపాయలు రావాల్సి ఉంది.. అవి ఇవ్వకుండా, కొత్తగా పనులు చేపట్టాలంటే ఎవరు మాత్రం ముందుకు వస్తారు.. అని బలంగా ప్రశ్నించారు కోటం రెడ్డి. అయితే… ఇది కేవలం కోటంరెడ్డి సమస్య మాత్రమే కాదనేది జగమెరిగిన సత్యం! మెజారిటీ వైకాపా ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఇదే సమస్యతో కొట్టిమిట్టాడుతున్నారు.
వారిలో కొంతమంది బయటపడుతున్నారు కానీ… బయటపడకుండా వారిలో వారు నలిగిపోతున్న ఎమ్మెల్యేలు ఫుల్ గా ఉన్నారు! సో.. ఈ విషయంలో జగన్ సీరియస్ గా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొన్న ఆనం రామనారాయణ రెడ్డి అయినా, బొళ్ల బ్రహ్మనాయుడు అయినా, నిన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అయినా… రేపు మరోకరైనా… జగన్ కు చెప్పేది ఒకటే… నిధులు కావాలని – నియోజకవర్గాల్లో అభివృద్ధి ఆగిపోయిందని – కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని!
మరి ఈ విషయాలను జగన్ సీరియస్ గా తీసుకుంటారా.. సంక్షేమం విషయంలో తీవ్రంగా దృష్టి పెట్టిన జగన్ – తమ పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో కాస్త ధైర్యం గా తిరిగేలా చూస్తారా? లేదా? అన్నది వేచి చూడాలి!!