ఇండోనేషియాలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఆనం అనే ఓ వ్యక్తి ఏకంగా రైస్ కుక్కర్ ను పెళ్లి చేసుకున్నాడు. తాను ప్రేమించే రైస్ కుక్కర్ ను పెళ్లి చేసుకున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో తెల్లని వెడ్డింగ్ డ్రెస్ లో వరుడు మెరిసిపోయాడు. అంతేకాదు వధువుగా రైస్ కుక్కర్ ను వైట్ డ్రెస్ తో అందంగా ముస్తాబు చేశాడు.
పెళ్లి అనంతరం.. తన కుక్కర్ భార్యతో కలిసి కెమెరాకు ఫోజులు ఇచ్చాడు. తమ పెళ్లి కి చట్టబద్దత కల్పించేందుకు అవసరమైన పత్రాలపై పెండ్లి కోసం ఆనం సంతకాలు చేస్తూ… ఓ ఫోటోలో సందడి చేశాడు. మరో ఫోటటోలో రైస్ కుక్కర్ ను కిస్ చేస్తూ.. రొమాంటిక్ పోజిచ్చాడు. ఈ ఫోటోలకు వైట్.. క్వైట్.. ఫర్ ఫెక్ట్.. వెరీ డ్రీమీ అనే క్యాప్షన్ కూడా ఇచ్చాడు ఆనం.
సెప్టెంబర్ 20 న కుక్కర్ తో తన పెండ్లిని ప్రకటిస్తూ.. ఆనం ఫేస్ బుక్ పేజీలో ఈ ఫోటోలు పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలకు 44 వేలకు పైగా లైక్ లు, లక్షా 35 వేల రీ ట్వీట్ లు కూడా వచ్చాయి. అయితే.. తాజాగా తన భార్యకు విడాకులు ఇచ్చేశాడు ఆనం. తన భార్య అన్నం బాగా వండుతుంది కానీ ఇతర వంటకాలు చేయడం లో ప్రతిభ చూడటం లేదన్నాడు ఆనం.