పూరీకి వైసీపీతో సంబంధాల వ‌ల్లే డ్ర‌గ్స్ కేసులో ఊర‌ట : టీడీపీ నేత

-

పవన్ కళ్యాణ్ పై ప్రశాంత్ కిశోర్ స్ట్రాటర్జీని వాడుతున్నారని ఏపీ టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి చింతకాయల విజ‌య్ వ్యాఖ్యానించారు. ఏపీని చంద్రబాబు సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ గా మార్చితే.. జగన్ డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ గా మార్చారంటూ ఆరోప‌ణ‌లు చేశారు. వైసీపీతో సంబంధాలు ఉన్నాయి కాబట్టే పూరి జగన్నాథ్ కు డ్రగ్స్ కేసు నుంచి క్లీన్ చిట్ ఇచ్చారని విజ‌య్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఏపీలో జరుగుతోన్న హెరాయిన్ దందాపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

క్లీన్ గా లేరు కాబట్టే వైసీపీ నేతలు మేమిచ్చిన డ్రగ్ చాలెంజ్ ను స్వీకరించలేదని విజ‌య్ వ్యాక్యానించారు. మాజీమంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేల ఇళ్ళపై దాడులు చేపించటమే జగన్ పనిగా పెట్టుకున్నారంటూ మండి ప‌డ్డారు. ఒరిస్సా, ఢిల్లీ సహా.. ఎక్కువ డ్రగ్స్ దొరికిన ఏపీతో సంబంధాలుంటున్నాయని అన్నారు. చంద్రబాబు హయాంలో గంజాపై ఉక్కు పాదం మోపారని…ఏపీలో జరుగుతోన్న మాదకద్రవ్యాల దందాపై కేంద్రం జోక్యం చేసుకోవాలని విజ‌య్ డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version