కిడ్నీల ఆరోగ్యం విషయంలో ఈ తప్పులు చేయకండి..!

-

ఆరోగ్యంగా ఉండటం అంటే పైకీ యాక్టీవ్‌గా కనిపించడంతోనే అయిపోదు. లోపల సిస్టమ్‌ అంతా పర్ఫెక్ట్‌ ఉండాలి. అందులో ముఖ్యంగా కిడ్నీలు, గుండె పనితీరు మెరుగ్గా ఉండాలి. ఈ రెండు పాడైతే మనిషి జీవితం పోయినట్లే. కిడ్నీల సమస్య ప్రాణాంతకమైనదే..! దీర్ఘకాలిక రోగాలు అన్నీ కిడ్నీల మీద ఎఫెక్ట్‌ అవుతాయి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే నైతికంగా మనం ఏం చేయాలో ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే..

మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోండి. డైలీ వ్యాయామం చేయండి.

కిడ్నీ ఆరోగ్యానికి రక్తపోటు నియంత్రణ ఉండేలా చూసుకోవాలి.

డయాబెటిక్ పేషెంట్లకు ఎక్కువ ప్రమాదం ఉన్నందున చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోండి.

రోజువారీ ఆహారంలో ఆరోగ్యకరమైన వాటిని మాత్రమే చేర్చుకోవాలి.

బరువు పెరగకుండా చూసుకోండి. వీలైనంత వరకు బెల్లీ ఫ్యాట్, శరీరంలో కొవ్వును తగ్గించుకోండి.

తాజా ఆహారాన్ని మాత్రమే తినండి. నిల్వ ఉన్న ఆహార పదార్థాలను తినడం వల్ల మూత్రపిండాలు దెబ్బతింటాయి.

సిగరెట్, బీడీ, హుక్కా లాంటి వాటికి దూరంగా ఉండండి.

కిడ్నీ పాడవడానికి మద్యపానం కూడా ప్రధాన కారణం.

వైద్యుల సలహా లేకుండా ఎలాంటి మందులు,టాబ్లెట్స్‌ రెగ్యులర్‌గా తీసుకోవద్దు.

నీరు తీసుకోవడం చాలా ముఖ్యం. తక్కువగా లేదా ఎక్కువగా తీసుకున్న ప్రమాదమే. ఇది మూత్రపిండాలను ఫిల్టర్ చేయడంలో సమస్యలను కలిగిస్తుంది. రోజూ 2 నుంచి 3 లీటర్ల నీరు తప్పనిసరిగా తాగాలి.

ఉప్పు ఎక్కువగా తీసుకోవడం నియంత్రించండి. ఎందుకంటే ఇది BPని పెంచుతుంది. రోజుకు 5 నుంచి 6 గ్రాముల ఉప్పు మాత్రమే తినాలి.
క్షీణిస్తున్న జీవనశైలిని మార్చుకోండి. సరైన దినచర్యను అనుసరించండి.

ఈ జాగ్రత్తలు పాటిస్తే కిడ్నీలేంటీ..మొత్తం బాడీయే ఆరోగ్యంగా ఉంటుంది. వీటిల్లో మీరు ఎన్ని చేస్తున్నారు.. మానేయాల్సినవి ఉన్నాయా లేవా అని మీరే ఓసారి ఆలోచించండి. లైఫ్‌ చాలా చిన్నది..ఎంజాయ్‌ చేయాలి..తప్పులేదు.. కానీ కిడ్నీలు అంతకంటే చిన్నవి కదా..! అవయవాలు ఆరోగ్యంగా ఉన్నంతకాలమే మనిషి జీవితం ఆనందంగా ఉంటుంది.!

Read more RELATED
Recommended to you

Exit mobile version