కనీస మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. “కనీస మద్దతు ధర” (ఎంఎస్‌పి) పై 29 మందితో కేంద్ర ప్రభుత్వం కమిటీ వేసింది. “ఎంఎస్‌పి” తో పాటు, జీరో బడ్జెట్ వ్యవసాయం, వ్యవసాయ మార్పిడి వంటి అంశాలపై అధ్యయనం చేయనుంది ఈ కమిటీ. కమిటీ విధివిధానాలను, బాధ్యతలను స్పష్టంగా పేర్కొంది.
కనీస మద్దతు ధర కమిటీ విధి విధానాలు
—————————-
• “ఎంఎస్‌పి” కి మూడు విధి విధానాలు పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల.
1) వ్యవస్థను మరింత ప్రభావవంతంగా, పారదర్శకంగా చేయడం ద్వారా దేశంలోని రైతులకు “ఎంఎస్‌పి” ని అందుబాటులో ఉంచడానికి సూచనలు చేయాలి.
2) “కమీషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్” (సిఎసిపి)కి మరింత స్వయంప్రతిపత్తి కల్పించేందుకు ఆచరణాత్మకతపై
సూచనలు. దానిని మరింత శాస్త్రీయంగా మార్చేందుకు చర్యలు సూచించాలి.
3) దేశీయ ఎగుమతి అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా పంట ఉత్పత్తులకు లాభసాటి ధరలు కలిపించడం, దేశంలో మారుతున్న అవసరాలకు అనుగుణంగా “వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థ”ను బలోపేతం చేయడం వంటి అంశాలపై సూచనలు.
ఇవ్వాలి. అలాగే, ప్రకృతి వ్యవసాయం, పంట మార్పిడికి కూడా సలహాలు, సూచనలు చేయాలి