డబుల్‌ బెడ్‌రూం ఇల్లు వెనక్కిచ్చేసింది.. తెలిస్తే వావ్ అనాల్సిందే..

-

రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న డబుల్‌ బెడ్‌రూం ఇల్లు మంజూరైతే ఆ ఆనందమే వేరు. అందుకోసం నానా ఇబ్బందులు పడుతాం.. ప్రతి రోజు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ మేము కూడా అర్హులమని తమకు డబుల్‌ బెడ్‌రూం కేటాయించాలని అధికారుల ముందు వివరిస్తాం. అయినా మంజూరవుతుందని నమ్మకం ఉండదు. ఒకవేళ మంజూరైతే సొంతిటికళ నెరవేరిన ఆనందమే వేరు. అలాంటిది ప్రభుత్వమే మంజూరుచేసి పత్రాలు అందింస్తే ఆ మహిళ తనకు వద్దని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

మరో పేద కుటుంబానికి ఇవ్వండి..

సిద్దిపేటకు చెందిన రచ్చలక్ష్మి, భర్త కొన్నాళ్ల క్రితం మరణించాడు. ప్రస్తుతం ఆమె కుమార్తెతో జీవిస్తోంది. భర్త చనిపోవడంతో తెలంగాణ ప్రభుత్వం ఆమెకు డబుల్‌ బెడ్‌రూం మంజూరు చేయించింది. ఆ ఇంటికి సంబంధిత పత్రాలను జిల్లా కలేక్టర్‌ ఆమెకు అందజేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. పత్రాలు అందుకున్న లక్ష్మిమాత్రం, తనకు డబుల్‌ బెడ్‌రూం కేటాయించడం సంతోషంగా ఉందని కానీ.. ఆ ఇళ్లు తనకు అవసరం లేదని అక్కడున్న వారందరినీ ఆశ్యర్యానికి గురి చేసింది. ‘‘ నాకు భర్త లేడు, ప్రస్తుతం నేను నా కుమార్తె ఉంటుంన్నాం, తనకు పెళ్లి చేస్తే ఇక నేను ఒంటరిగానే ఉంటాను. నాకోసం ఇంత పెద్ద ఇల్లు అవసరం లేదు. నేను నా అన్నదమ్ముల వద్ద ఉంటాను ఆ ఇంటిని నా లాంటి మరో పేద కుటుంబానికి ఇవ్వండి’’ అని చెప్పింది. నిజాయితీ చాటుకున్న లక్ష్మిని మంత్రి హరీష్‌రావు అభినందించి ఆమె కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version