ఈరోజు ఉదయాన్నే దారుణ వార్త వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలో ఈ ఉదయం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో 10 మంది నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన బాంద్రా జిల్లా ఆసుపత్రిలో ఈ తెల్లవారు జామున జరిగింది. బాంద్రా జిల్లా ఆసుపత్రిలోని న్యూ బోర్న్ కేర్ యూనిట్‌లో మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదం సంభవించిన సమయంలో ఎన్‌సీయూలో మొత్తం 17 మంది చిన్నారులు ఉండగా వారిలో ఏడుగురిని రక్షించగలిగారు.
అప్పటికే 10 మంది చనిపోయారు. అయితే ఈ మంటలు ఎందుకు చెలరేగాయి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. సడన్ గా ఈ న్యూ బోర్న్ కేర్ యూనిట్ మంటలు చెల రేగాయి… మొదట పొగ రావడాన్ని గుర్తించిన ఓ నర్స్ మిగతా సిబ్బందికి, అధికారులకు సమాచారం ఇచ్చింది… వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు యత్నించారు. అయితే అప్పటికే పది మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.