విశాఖ, విజయవాడలో మెట్రో రైల్ ప్రాజెక్ట్ లపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. 2017 మెట్రో పాలసి ఆధారంగా ఫండింగ్ పాలసీ పై సీఎం ఆదేశాలు ఇచ్చారు. అయితే విశాఖ, విజయవాడలో డబుల్ డెక్కర్ మెట్రో లపై దృష్టి పెట్టింది ప్రభుత్వం. 2017 మెట్రో పాలసీ ప్రకారం 100 శాతం ఈక్విటీ కేంద్రమే చెల్లించి కలకత్తా మెట్రో పూర్తి చేసింది అన్నారు సీఎం చంద్రబాబు.
ఇదే తరహాలో ఏపీ లో కూడా మెట్రో ప్రాజెక్ట్ విషయంలో కేంద్రంతో చర్చించాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. విశాఖ, విజయవాడలో డబుల్ డెక్కర్ మెట్రో నిర్మాణం చేయాలన్నారు. హైవేలు ఉన్న చోట డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో.. ముందు రోడ్డు ఆ పైన ఫ్లై ఓవర్ ఆ పైన మెట్రో వచ్చేలా ప్లాన్ చేయాలన్నారు. విశాఖలో మొదటి దశలో మధురవాడ నుంచి తాడిచెట్ల పాలెం వరకు 15 కీమి.. గాజువాక నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ వరకు 4 కీమి.. విజయవాడలో రామవరప్పాడు నుంచి నిడమనుర్ వరకు 4.7 కీమి.. రెండు నగరాల్లో డబుల్ డెక్కర్ మెట్రో పై సీఎం చంద్రబాబు కీలక సూచనలు ఇచ్చారు. 4 ఏళ్లలో లక్ష్యాలు పెట్టుకుని పని చెయాలన్నారు సీఎం.