తాను ప్రభుత్వాన్ని ఎప్పుడూ తిట్టలేదని, అసలు ప్రభుత్వాన్ని కాని, జగన్ ని కానీ తిట్టాల్సిన అవసరం తనకు ఎందుకు ఉంటుంది అని అంటున్నారు డాక్టర్ సుధాకర్. గతకొన్ని రోజులుగా డాక్టర్ సుధాకర్ విషయంపై ఏపీ రాజకీయాల్లో తీవ్ర హడావిడే జరిగింది. కోర్టుల వరకూ ఈ వ్యవహారం వెళ్లింది. తాజా సంఘటనలపై స్పందించారు డా. సుధాకర్!
“సీఎం జగన్ గారు నాకు దేవుడు.. మోదీ గారిని కూడా నేను తిట్టలేదు.. వాళ్లను తిట్టే ధైర్యం ఉందా? శత్రువులను కూడా నేను తిట్టను.. ప్రధాని మోదీ అంటే ఎంతో ఇష్టం.. అలాంటి నాయకుడ్ని తిడతానా? వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే చాలా ఇష్టం. ఇక జగన్ గారైతే పేదల పాలిట మంచి పనులే చేస్తున్నారు.. చంద్రబాబు హయాంలో కూడా పని చేశాను.. చంద్రబాబు కార్యకర్తనైతే కాదు.. అయ్యన్నపాత్రుడు ఇంటికి వెళ్లడమే నేను చేసిన పెద్ద తప్పు.. ఎవరికో చెడ్డ పేరు తెచ్చేందుకే నాపై దాడి చేశారు.. పిచ్చోడి ముద్ర వేసి జాబ్ తీసేయాలని కుట్ర పన్నారు.. నేనైతే ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు.. పేదలకు సేవ చేయాలనే ఉద్యోగం చేస్తున్నా.. ముఖ్యమంత్రి జగన్ గారు క్షమించి నా ఉద్యోగం ఇప్పించాలని కోరుతున్నా” అంటూ స్పందించారు డాక్టర్ సుధాకర్.
జగన్ దేవుడు.. నన్ను క్షమించాలి: డాక్టర్ సుధాకర్!
-