ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో ఇంకా ప్రత్యేకమైన డ్రామాలు నడుస్తూనే ఉన్నాయి…అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం హోదా విషయంలో హైడ్రామా నడిపించేస్తున్నారు..ఇందులో ప్రతిపక్ష టీడీపీ కూడా ఒక సైడ్ క్యారెక్టర్ పోషిస్తుంది. అసలు విభజన తర్వాత ఏపీ అభివృద్ధి కోసం ప్రత్యేక హోదాని అప్పటి యూపీఏ ప్రభుత్వం ఇచ్చింది…కాంగ్రెస్ ఐదేళ్లు అంటే బీజేపీ పట్టుబట్టి మరీ పదేళ్ళు హోదా ఇప్పించేలా చేసింది.
సరే అని జనం..జగన్ మాట నమ్మారు…వైసీపీని గెలిపించారు..కానీ మొదట్లోనే హోదా విషయంలో జగన్ చేతులెత్తేశారు. కేంద్రంలో బీజేపీకి ఫుల్ మెజారిటీ ఉందని, ప్లీజ్ ప్లీజ్ అడగటం తప్ప ఏమి చేయలేమని అన్నారు…ఇటు టీడీపీ సైతం హోదా గురించి వదిలేసింది. అయితే తాజాగా కేంద్ర హోమ్ శాఖ… తెలంగాణ, ఏపీలకు సంబంధించిన విభజన హామీలపై ఒక కమిటీ వేసింది…9 అంశాలపై చర్చ చేయడానికి సిద్ధమైంది…ఇందులో హోదా కూడా పెట్టింది. దీంతో జగన్ హోదా సాధించేసారని చెప్పి వైసీపీ ఎంపీ, శ్రేణులు, మీడియా తెగ ప్రచారం చేశాయి.
కానీ కొన్ని గంటల్లోనే 9 కాస్త 5 అంశాలపై చర్చ అని లెటర్ వచ్చింది. ఇందులో హోదా లేచిపోయింది. దీంతో వైసీపీకి షాక్ తగిలినట్లైంది. అయితే ఈ విషయంలో కేంద్రం పదే పదే మోసం చేస్తున్నట్లే కనిపిస్తోంది..ఈ మోసంలో వైసీపీ, టీడీపీల పాత్ర కూడా ఉందనే చెప్పాలి. మరి ఏపీకి హోదా ఎప్పుడు వస్తుందో చూడాలి.