వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన జవాన్ల బస్సు !

-

ఛత్తీస్​గఢ్​లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. అదేంటంటే సీఆర్పీఎఫ్ జవాన్లని తీసుకు వెళ్తున్న బస్సు వరద ప్రవాహంలో పడి కొట్టుకుపోయింది. వివరాల్లోకి వెళ్తే ఛత్తీస్​గఢ్ లోని మల్కన్​గిరి సరిహద్దు ప్రాంతం- ఒడిశాలోని బీజాపూర్​రహదారిపై భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. అదే మార్గం గుండా ఆర్మీ బస్సు వెళ్తుండగా ఈ ఘటన సంభవించింది. అయితే ప్రమాద సమయంలో 30 మంది జవాన్లు అందులో ఉండగా అందరూ సురక్షితంగా బయట పడ్డారు.

వారంతా బస్సులో నుండి బయటకు వచ్చి ఒడ్డుకు చేరుకున్నారు. అయితే బస్సును మాత్రం వారు అదుపు చేయలేక పోయారు. బస్ ఆ వరదని దాటుకుని వెళ్తుందని డ్రైవర్ భావించాడని, అందుకే ఆయన ముందుకు బస్సును పోనిచ్చాదని తెలుస్తోంది. ఇక డిస్ట్రిక్ట్​ రిజర్వ్​డ్​ గ్రూప్​(డీఆర్​జీ) జవాన్లు.. నక్సల్స్​ ఆపరేషన్​ నిర్వహించి తిరిగివస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం అందాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version