క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల్లో యువత హంగామా మామూలుగా ఉండదు. అర్ధరాత్రి కేక్‌లు కట్ చేయడం, ఫ్రెండ్స్‌తో హ్యాపీగా ఎంజాయ్ చేయడం, బైక్‌లతో రోడ్లపై హల్‌చల్ చేయడం ఇలా పలు రకాలుగా వాళ్లు పిచ్చాపాటిగా వేడుకలు జరుపుకుంటారు. క్రిస్మస్ పండుగకు మరో రోజు మా త్రమే గడువు ఉండటంతో నగరమంత టా సందడి వాతావరణం నెలకొంది. రెండు పం డుగల సందర్భంలోనే బెంగళూరు వ్యాప్తం గా కొత్త నిబంధనలు జారీ చేశారు. మద్యం బాబులకు మెట్రో రైళ్లలో ‘నో ఎంట్రీ ’ ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితిలోను మద్యం తాగి మెట్రో రైళ్లలో ప్రయాణించే అవకాశం లేకుండా పోయింది.
ఇదే నిబంధన న్యూ ఇయర్‌కూ వర్తించనుంది. కొత్త సంవత్సర వేడుకలు ఎక్కడైనా జరుపుకోవ చ్చు అనుకుంటే పోలీసుల నుంచి కేసులు ఎదుర్కోవలసి ఉంటుంది. పార్కులు, బహిరం గ ప్రదేశాలలో న్యూఇయర్ వేడుకలు జరుపుకోరాదని ఆదేశించారు. ఈమేరకు ప్రచారాలు చేస్తున్నారు. సరదాగా గడుపుదామని భావించే నగర ప్రజలకు ముందుగానే కట్టడి చేసినట్లు అవుతోంది.