కరోనా వైరస్ దెబ్బకి కేంద్రం లాక్ డౌన్ అమలు చేయటంతో అత్యవసరం మరియు నిత్యవసర సర్వీసులు తప్ప మిగతావన్నీ మూతపడ్డాయి. మద్యం దుకాణాలు సైతం మూతపడటం జరిగాయి. ఇటువంటి టైం లో కొన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ కారణంగా మద్యాన్ని డోర్ డెలివరీ కొన్ని ప్రభుత్వాలు చేయగా మరికొన్ని పూర్తిగా మద్యం దుకాణాలను క్లోజ్ చేసేశారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో మద్యం లేక చాలా మంది మానసిక రోగులు గా మారిపోయి… పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. కొన్నిచోట్ల కళ్ళు తాగి మత్తు లో మునగాలని ప్రయత్నించి పోలీసులకు దొరికి లాఠీ దెబ్బలు తింటున్నారు.
దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మందుబాబులు మేము అస్సాం వెళ్ళిపోతాం పంపండి బాబోయ్.. అంటూ సోషల్ మీడియాలో ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. మందు దొరకక ఉండలేకపోతున్నాం… మాకు అస్సాం, మేఘాలయ వెళ్ళటానికి పర్మిషన్ ఇవ్వండి. లేకపోతే నిత్యావసరాలు తెరిచే టైములో మందు దుకాణాలు ఓపెన్ చేయండి అంటూ ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకపక్క పేదవాడి ఆకలి కేకలు వేస్తూ ఉంటే మరోపక్క తెలుగు రాష్ట్రాలలో మందు బాబులు మాత్రం బార్ షాపులు ఓపెన్ చేయండి అంటూ ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తున్నారు.