స్కూల్ బస్సు ఆగిపోవడంతో డ్రైవర్ పిల్లలతో నెట్టించారు.ఈ విషయం తెలియడంతో యాజమాన్యం తీరుపై తల్లిదండ్రుల ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ ఘటన విజయనగరం జిల్లా రాజాంలో శుక్రవారం ఆలస్యంగా వెలుగుచూసింది.
రాజాంలో గల వరలక్ష్మి సెంటెన్స్‌కు చెందిన స్కూల్ బస్సు నడిరోడ్డుపై ఆగిపోవడంతో డ్రైవర్ విద్యార్థులతో నెట్టించారు. వేసవి కాలంలో ఎర్రటి ఎండలో పిల్లలతో స్కూల్ బస్సు నెట్టించడంపై స్కూల్ యాజమాన్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలు బస్సు నెడుతున్న దృశ్యాన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా అది కాస్త వైరల్ అయ్యింది. దీంతో పేరెంట్స్ స్కూల్ మేనేజ్మెంట్ మీద సీరియస్ అయ్యింది.
స్కూల్ బస్సు ఆగిపోవడంతో పిల్లలతో నెట్టించిన డ్రైవర్.. యాజమాన్యం తీరుపై తల్లిదండ్రుల ఆగ్రహం
విజయనగరం జిల్లా రాజాంలో వరలక్ష్మి సెంటెన్స్ కు చెందిన స్కూల్ బస్సు నడిరోడ్డుపై ఆగిపోవడంతో విద్యార్థులతో నెట్టించిన డ్రైవర్
వేసవి కాలంలో ఎర్రటి ఎండలో పిల్లలతో స్కూల్ బస్సు నెట్టించడంపై… pic.twitter.com/DCMP2iBOPb
— Telugu Scribe (@TeluguScribe) April 18, 2025