విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు టీచర్స్ మీద పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.ఈ ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో శుక్రవారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. రామారెడ్డి మండల పరిధిలోని ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కొంతమంది విద్యార్థినులపై ఇద్దరు ఉపాధ్యాయులు అసభ్యంగా ప్రవర్తించినట్లు సమాచారం.
దీంతో బాధిత విద్యార్థినులు నేరుగా షీ టీమ్‌కు కాల్ చేసి సమాచారమిచ్చారు.విచారణ చేపట్టిన పోలీసులు ఇద్దరు ఉపాధ్యాయులపై కేసు నమోదు చేసి రెండు రోజుల కిందట రిమాండ్‌కు తరలించారు. గత శనివారం అదే మండలంలోని ఓ పీఈటీ మీద కూడా పోక్సో కేసు నమోదు అయినట్లు సమాచారం.విద్యాబుద్ధులు నేర్చించాల్సిన వారే అసభ్యంగా ప్రవర్తిస్తే ఎలా పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు.