తెలంగాణ ఈఏపీసెట్ షెడ్యూల్ విడుదల

-

తెలంగాణలో ఇంజినీరింగ్‌, ఫార్మా, అగ్రికల్చరల్‌ ప్రవేశాల కోసం నిర్వహించే ఈఏపీసెట్‌ షెడ్యూల్‌ విడుదలైంది. ఈ నెల 29వ తేదీ నుంచి మే 4వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ బాలకృష్ణారెడ్డి తెలిపారు. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షకు అనుమతించమని స్పష్టం చేశారు.

ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మా ప్రవేశ పరీక్ష.. మే 2 నుంచి 4వ తేదీ వరకు ఇంజినీరింగ్‌ పరీక్ష జరగనుంది. రోజూ రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సాగనుండగా.. రెండో సెషన్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 16 ప్రాంతాల్లోని 124 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఫార్మా, అగ్రికల్చర్‌ స్టూడెంట్స్‌ ఏప్రిల్‌ 19 నుంచి.. ఇంజినీరింగ్ విభాగం విద్యార్థులు ఈ నెల 22 నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశ పరీక్షకు 86,101 మంది, ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షకు 2,19,420 మంది హాజరు కానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news