కశ్మీర్: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. కాల్పులు జరిపేందుకు ప్రయత్నిస్తున్నారు. సినీ ఫక్కీల్లో డ్రోన్లతో ప్రయోగాలు చేస్తున్నారు. ప్రతి రోజూ బోర్డర్‌లో కలకలం సృష్టిస్తున్నారు. ఇటీవల కాలంటో ఎయిర్ పోర్టులో జరిపిన కాల్పుల ఘటనను మర్చిపోకముందే మరో సారి డ్రోన్ల ద్వారా పేలుళ్లు జరిపేందుకు యత్నించారు.
గత ఆదివారం కూడా డ్రోన్ దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆదివారం తెల్లవారుజామున ఎయిర్ పోర్టులో పేలుళ్లు జరిగాయి. ఈ దాడిలో పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా హస్తం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసును ఎన్‌ఐఏ విచారిస్తోంది. 24 గంటలు గడవకముందే అంటే.. ఆదివారం రాత్రి 11.45 గంటలకు రత్నచక్, కాలూచక్ సైనిక ప్రాంతంలో ఒక డ్రోన్, అర్ధరాత్రి 2.40 గంటలకు ఇంకో డ్రోన్ తిరిగాయి. వీటి కదలికలను గుర్తించిన సైన్యం 25 రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో అవి అక్కడ నుంచి అదృశ్యమయ్యాయి.