ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి.తాజాగా ఏపీ సర్కార్ ప్రభుత్వంలోని కీలక రాజకీయ నేతలపై సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై పోలీసులు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ కుటుంబీకులపై చేసిన వ్యాఖ్యలపై అందిన ఫిర్యాదుల ఆధారంగాను వారిని అరెస్టులు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. వైసీపీ నేతలు తన తల్లిని అవమానించారని మంత్రి నారా లోకేశ్ నిరూపిస్తే బేషరతుగా క్షమాపణ చెప్పి రాజకీయాలను వదిలేస్తానని మాజీ మంత్రి అంబటి అని ట్వీట్ చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేశారని కేసులు పెడితే ముందుగా ప్రస్తుత స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌లపైన పెట్టాలని, వారిని అరెస్టు చేయాలని అంబటి రాంబాబు సవాల్ విసిరారు.