రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ శీతాకాల విడిది షెడ్యూల్ ఇదే

-

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది షెడ్యూల్ విడుదల చేశారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు హకీంపెట్ విమానాశ్రయం చేరుకుంటారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము కు సీఎం కెసిఆర్, గవర్నర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్వాగతం పలుకుతారు. సికింద్రాబాద్ యుద్ధ స్మారకం వద్ద పుష్పాంజలి ఘటిస్తారు… బొల్లారం లో వీరనారీలకు సత్కారం చేస్తారు. ఇవాళే ద్రౌపది ముర్మూ ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకోనున్నారు. కేంద్ర పర్యాటక శాఖ చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఇక 27వ తేదీ ఉదయం కేశవ్ మెమోరియల్ విద్యా సంస్థలను విజీట్ చేస్తారు… అక్కడ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు.

అదే రోజు మధ్యాహ్నం సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో అఖిల భారత పోలీస్ 74వ బ్యాచ్ ట్రైనీ అధికారులతో పాటు నేపాల్, భూటాన్, మారిషస్, మాల్దీవుల అధికారులతో కూడా రాష్ట్రపతి సమావేశం అవుతారు.డిసెంబర్ 28వ తేదీన భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రసాద్ పథకం కింద చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. మిథాని సంస్థకు చెందిన వైడ్ ప్లేట్ మిల్ ప్లాంటును వర్చువల్‌గా ప్రారంభిస్తారు.

28 న మధ్యాహ్నం వరంగల్‌లోని రామప్ప ఆలయం సందర్శిస్తారు. కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ స్కీమ్ ను ప్రారంభిస్తారు…. కేంద్ర సాంస్కృతిక శాఖ కు చెందిన ప్రాజెక్ట్ లకు శంకుస్థాపన చేస్తారు.29వ తేదీ ఉదయం హైదరాబాద్ షేక్ పేటలోని జి.నారాయణమ్మ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మహిళా కాలేజీ లో విద్యార్థులు, ఫ్యాకల్టీ ఇంటరాక్ట్ అవుతారు.

అదే రోజు సాయంత్రం 5 గంటలకు శంషాబాద్‌ శ్రీరామ్ నగర్‌లో సమైక్యతా మూర్తి విగ్రహాన్ని సందర్శిస్తారు.

30వ తేదీ ఉదయం రంగారెడ్డి జిల్లాలోని కన్హా శాంతివనంలో శ్రీ రామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన అంగన్ వాడీ, ఆశా వర్కర్లతో సమావేశం అవుతారు. వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. మధ్యాహ్నం రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి విందు ను ఏర్పాటు చేశారు…

 

 

*రాష్ట్రపతి పర్యటన షెడ్యూల్*

 

_డిసెంబర్‌ 26న_

 

12.15 నుండి 12.45 వరకు శ్రీశైలం పర్యటన

 

మధ్యాహ్నం 3.05 – 3.15 సికింద్రాబాద్ బొల్లారంలోని యుద్ధ స్మారకం వద్ద పుష్పాంజలి. వీరనారీలకు సత్కారం.

 

_డిసెంబర్ 27న_

 

ఉదయం 10.30 – 11.30 నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ విద్యాసంస్థలో విద్యార్థులు, ఫ్యాకల్టీతో సమావేశం

 

మధ్యాహ్నం 3.00- 4.00 సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో అఖిల భారత పోలీస్ సేవల 74వ బ్యాచ్ ట్రైనీ అధికారులతోపాటు భూటాన్, నేపాల్, మారిషస్ మాల్దీవుల దేశాల అధికారులతో సమావేశం

 

_డిసెంబర్‌ 28న_

 

ఉదయం 10.40 – 11.10 భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామి ఆలయ సందర్శన. ప్రసాద్ పథకం ప్రారంభం. అనంతరం మిశ్ర ధాతు నిగం లిమిటెడ్(మిథాని)కి సంబంధించిన వైడ్ ప్లేట్ మిల్ ప్లాంట్ ను వర్చువల్ లు ప్రారంభిస్తారు.

 

మధ్యాహ్నం 3.00-3.30 వరంగల్‌లోని రామప్ప ఆలయ సందర్శన. ప్రసాద్ ప్రాజెక్టు ప్రారంభం… ప్రాజెక్ట్ లకు శంకుస్థాపన

 

_డిసెంబర్‌ 29న_

 

ఉదయం 11.00-12.00 షేక్‌పేటలోని జి.నారాయణమ్మ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మహిళా కళాశాల సందర్శన. విద్యార్థులు, ఫ్యాకల్టీతో సమావేశం.

 

సాయంత్రం 5.00-6.00 శంషాబాద్‌లోని శ్రీరామ్‌నగర్‌లో సమైక్యతామూర్తి (శ్రీ రామానుజాచార్య) విగ్రహ సందర్శన

 

_డిసెంబర్ 30న_

 

ఉదయం 10.00-11.00 రంగారెడ్డి జిల్లాలోని కన్హా శాంతి వనంలో శ్రీ రామచంద్ర మిషన్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన అంగన్వాడీ, ఆశా వర్కర్లను ఉద్దేశించి ప్రసంగం.

 

అనంతరం సాంస్కృతిక మంత్రిత్వశాఖ, శ్రీ రామ చంద్ర మిషన్ కలిసి చేపడుతున్న ‘హర్ దిల్ ధ్యాన్, హర్ దిన్ ధ్యాన్’ ప్రచార కార్యక్రమం ప్రారంభం.

 

మధ్యాహ్నం 1.00గంటకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో విందు ఇవ్వనున్న రాష్ట్రపతి

Read more RELATED
Recommended to you

Exit mobile version