హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ పార్టీ కలకలం.. ప్రముఖ కొరియోగ్రాఫర్ అరెస్టు

-

హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. ఓయో హోటల్‌లో డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తున్నారని పక్కా సమాచారం రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆకస్మిక దాడులు చేపట్టారు. ఈ తనిఖీల్లో ప్రముఖ కొరియోగ్రాఫర్ కన్హ మహంతిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆమెతో పాటు ఈ పార్టీ నిర్వహించిన ఆర్కిటెక్ట్ ప్రియాంక రెడ్డిని కూడా పోలీసులను అరెస్టు చేశారు.

అయితే, ప్రియాంక రెడ్డి ఇచ్చిన పార్టీకి కన్హ మహంతి హాజరైనట్లుగా సమాచారం.ఈ పార్టీ కోసం బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న నలుగురిని పోలీసులు అరెస్టు చేయగా.. వారి నుంచి ఎండీఎంఏతో పాటు మరో రెండు రకాల డ్రగ్స్‌‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలాఉండగా, నగరంలో డ్రగ్స్ కల్చర్ విపరీతంగా పెరుగుతుండటంపై సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version