డ్రగ్స్ దాడుల్లో షారుఖ్ ఖాన్ కొడుకు..!

-

దేశవ్యాప్తంగా డ్రగ్స్ కేసులు కలకలం రేపుతున్నాయి. సెలబ్రిటీలు పేర్లు డ్రగ్స్ కేసుల్లో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ కేసుల విచారణ జరుగుతోంది. ప్రస్తుతం ఈడీ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ ప్రముఖుల్ని విచారిస్తోంది. ఈ కేసు రోజుకో మలుపుతిరుగుతోంది. ఇదే విధంగా బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తరువాత డ్రగ్స్ కేసులు వెలుగులోకి వచ్చాయి. తాజా మరో బాలీవుడ్ బాద్షా షారుఖ్ కోడుకు కూడా ఓ డ్రగ్ వివాదంలో పట్టబడ్డారు. శనివారం రాత్రి రేవ్ పార్టీ జరుగుతుందనే పక్కాసమచారంలో నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో(NCB) నిర్వహించిన దాడుల్లో ముంబై కి చెందిన పలువురు ప్రముఖుల పిల్లలు పట్టుబడ్డట్లు సమాచారం. ముంబైకి సమీపంలో అరేబియా సముద్రంలో కార్డిలియా అనే క్రూయిజ్ షిప్ లో డ్రగ్స్ పార్టీ జరుగుతుందనే పక్కాసమాచారంలో NCB దాడులు నిర్వహించింది. ఈ పార్టీలో షారుఖ్ ఖాన్ కోడుకు ఆర్యన్ ఖాన్ కూడా ఉండటం ఇప్పుడు కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఆర్యన్ పై ఎటువంటి కేసులు బుక్ చేయలేదని, కానీ రేవ్ పార్టీపై సమచారం రాబట్టే పనిలో NCB అధికారులు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version