ఇండియా లో కరోనా మహమ్మారి కేసులు పెరుగుతూ… తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 22, 842 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 2,70,557 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.16 శాతంగా ఉంది.
ఇక దేశంలో తాజాగా 244 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 4,48,817 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 25, 930 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,30,94,529 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 90,51,75,348 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక కేరళ రాష్ట్రం లో గడిచిన 24 గంటల్లో 13, 217 కరోనా కేసులు నమోదు కాగా… 121 మరణాలు నమోదు అయ్యాయి. కాగా… దేశం లో ప్రతి రోజూ 50 లక్షల కు పైగా వ్యాక్సిన్లను అందించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ…ప్రయత్నాలు చేస్తోన్న సంగతి తెలిసిందే.
India reports 22,842 new COVID cases, 25,930 recoveries, and 244 deaths in the last 24 hours
Active cases: 2,70,557 (lowest in 199 days)
Total recoveries: 3,30,94,529
Death toll: 4,48,817Total vaccination: 90,51,75,348 pic.twitter.com/sCx5OuaGLo
— ANI (@ANI) October 3, 2021