సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు మరోసారి తెర పైకి వచ్చింది. నాలుగేళ్లు తరువాత సిట్ దాఖలు చేసిన చార్జ్ షీట్‌కు న్యాయస్థానం ఆమోదం తెలిపింది. 2017 జులై 2న ఎక్సైజ్ పోలీసులు డ్రగ్స్ కేసు నమోదు చేశారు. డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ పోలీసులు 12 కేసులు నమోదు చేశారు. అందులో 60 మందికి పైగా అధికారులు విచారణ చేశారు. 30 మందిని అరెస్టు చేసి 27 మందిని విచారణ చేసినట్లు ఎక్సైజ్ అండ్ ఎన్ ఫోర్స్‌మెంట్ అధికారులు చార్జ్ షీట్ లో పేర్కొన్నారు.
12 కేసుల్లో తొలుత ఎనిమిది కేసుల్లో మాత్రమే అధికారులు చార్జిషీట్ ఫైల్ చేశారు. ఎక్సైజ్ పోలీసుల పై తీవ్ర ఆరోపణలు రావడంతో ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ మరో నాలుగు చార్జిషీట్లు దాఖలు చేసింది. 11 మంది సినీ ప్రముఖులతో పాటు హీరో రవితేజ డ్రైవర్ శ్రీనివాసులను ఎక్సైజ్ పోలీసులు విచారించారు. డ్రగ్స్ కేసులో ఉన్న 11 మంది సినీ ప్రముఖులకు ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ క్లీన్ చిట్ ఇచ్చింది ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్.