గుంటూరు డ్రగ్స్ మాఫియా సూత్రదారులను గుర్తించారు పోలీసులు. కర్ణాటక సినీ స్టంట్ మాస్టర్ మాక్సికన్, నైజీరియాకు చెందిన జాన్‌లను పట్టుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. గుంటూరులో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ మాఫియా తీవ్ర కలకలం సృష్టించింది. డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్న విదేశీ విద్యార్థులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు దర్యాప్తు ముమ్మరం చేయటంతో అసలు తయారీదారులూ వెలుగులోకి వచ్చారు.
కర్ణాటక సినీ స్టట్ మాస్టర్ మాక్సికన్, నైజీరియాకు చెందిన జాన్ లు డ్రగ్స్ ను బెంగుళూరు కేంద్రంగా తయారు చేస్తున్నట్టు గుర్తించారు. విదేశాల నుండి ముడిసరుకు తెప్పించి బెంగుళూరులో తయారు చేయించి, దక్షిణాది రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో ఫార్ములా ఇచ్చి రకకరకాల ఫ్లేవర్లలో డ్రగ్స్ తయారీ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మాక్సికర్, జాన్‌లను పట్టుకోవటం పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది.