బ్రేకింగ్: హైదరాబాద్ లో బీజేపీ భారీ కుట్రని బయటపెట్టిన కేటీఆర్…!

-

ఎల్లుండి దుబ్బాక లో ఉపఎన్నిక ఉండగా హైదరాబాద్ లో భారీ కుట్రకు బీజేపీ తెరతీసిందన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్. ఈరోజు బీజేపీ ఆఫీస్ ముందు పార్టీ కార్యకర్తతో హైడ్రామా చేసిందని దీనికి కొనసాగింపుగా రేపు హైదరాబాద్ లో బీజెపి ఆధ్వర్యంలో ఆందోళనకు సిద్ధం అవుతున్నారన్నారు. రేపు లాఠీ ఛార్జి, లేదంటే ఫైరింగ్ జరిగేలా బిజెపి ప్లాన్ చేస్తోందన్నారు.

దుబ్బాకలో బిజెపి ఎన్నో ఎత్తుగడలు, కుట్రలు చేసిందని మొదట డబ్బుల ప్రయోగం చేశారు..ఇప్పటికే చాలా సార్లు బిజెపి డబ్బులు పట్టుబడ్డాయి. డబ్బుల డ్రామా ఫెయిల్ అయింది..ఇక బీజేపీ వాళ్లపై దాడులు చేశారని డ్రామాలు చేశారు..బిజెపి వాళ్ళ ఇండ్ల పై సోదాలు జరిగిన నాడే, టీఆరెస్ వాళ్ళ ఇళ్లలో కూడా జరిగింది…దీంతో ఆ దాడుల డ్రామా కూడా విఫలం అయిందన్నారు. బీజేపీ సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తూ.. ఇష్టారాజ్యంగా టీఆరెస్ పై దుష్ప్రచారం చేశారని ఇక ఎల్లుండి ఎన్నిక ఉండగా చివరి కుట్రకు బీజేపీ పన్నాగం పన్నిందన్నారు. ఈ విషయాలన్ని బీజేపీలోని ఓ లీడర్ ద్వారానే తమకు లీకయినట్లు కేటీఆర్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version