హైదరాబాద్ లో రెండు వేరువేరు చోట్ల డ్రగ్స్ సీజ్ !

-

హైదరాబాద్ లో రెండు వేరువేరు కేసులో డ్రగ్స్ సీజ్ చేసామన్నారు వెస్ట్ జోన్ డిసిపి. నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ డ్రగ్స్ అరికట్టడంలో కీలకంగా పని చేస్తోందన్నారు. గంజాయి పట్టుకోవడం తేలిక కానీ సింథటిక్ డ్రగ్స్ పట్టుకోవడం కష్టమన్నారు. అయినప్పటికీ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ కీలకంగా పని చేసి డ్రగ్స్ ను పట్టుకుంటున్నారని తెలిపారు.

తాజాగా నేడు రెండు కేసుల ను డిటెక్ట్ చేశారని.. పంజాగుట్ట లో గతంలో 40 గ్రాములు కొకైన్, 8 మొబైల్స్ సీజ్ చేశామన్నారు. తాజాగా ఈ కేసులో నైజీరియన్ మొహమ్మద్ బాకరి నీ అరెస్ట్ చేశామని తెలిపారు. పట్టుబడ్డ నైజీరియన్ ముంబై లో ఓ ఆఫ్రికన్ రెస్టారెంట్ లో పని చేశారని.. అక్కడే ఈ కేసులో ఇప్పటికే పట్టుబడ్డ అపూర్వ ఉపాధ్యాయ పరిచయం అయ్యారని తెలిపారు. ఇద్దరు కలిసి డ్రగ్ పెడ్లర్ల అవతారం ఎత్తారని తెలిపారు. ముంబై లో ఇద్దరు కలిసి డ్రగ్స్ విక్రయించారని పేర్కొన్నారు.

పుణె లో ఎక్కువగా డ్రగ్స్ వాడకం ఉందని తెలిసి ముంబై నుండి పుణె లో డ్రగ్స్ అమ్మకం స్టార్ట్ చేశారని.. అలానే హైదరబాద్ లో ఉన్న కస్టమర్ లకు కూడా కొకైన్ సప్లయ్ చేయడం మొదలు పెట్టారని అన్నారు. వీరిని 2019 లో ఇద్దరినీ పుణె లో నార్కోటిక్ సెల్ పోలీసులు పట్టుకున్నారని.. 2020 లో బయటకు వచ్చి తిరిగి హైదరాబాద్, పుణె, ముంబై లో డ్రగ్ సప్లయ్ చేయడం స్టార్ట్ చేశారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version