ఉప్పల్‌లో అర్ధరాత్రి డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు.. 15 మంది అరెస్టు

-

మరో నాలుగు రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుండటంతో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను కఠినతరం చేశారు. బందోబస్తును సైతం మరింత పెంచారు. ఇప్పటికే నగరంలో మద్యం మత్తులో రోడ్డు ప్రమాదాలు వరుసగా జరుగుతున్న నేపథ్యంలో వాటిని అరికట్టేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం నడుం బిగించింది.

ఈ క్రమంలోనే శుక్రవారం అర్ధరాత్రి ఉప్పల్ నల్ల చెరువు వద్ద ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లక్ష్మీ మాధవి ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను నిర్వహించారు. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో సుమారు 15 వాహనాలను పట్టుకున్నారు.అనంతరం వాహనదారులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, ఇంట్లో కుటుంబ సభ్యులు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారని సూచనలు చేశారు. కాగా, ఇటీవలి కాలంలో మద్యం సేవించి వాహనాలు నడిపే వారి వలన అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు అనేకం వెలుగుచూస్తున్నాయి.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news