తమిళ సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోలు అయిన చియాన్ విక్రమ్, తలపతి విజయ్ ల నట వారసులు సినీ ఒకే సినిమాలో భాగం కానున్నారు. ఇప్పటికే చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా తన సత్తాను నిరూపించుకునే విధంగా రెండు సినిమాలలో విశ్వరూపం చూపించాడు. ఇక విజయ్ తనయుడు జాసన్ సంజయ్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. ఇతను డైరెక్టర్ గా ధృవ్ విక్రమ్ హీరోగా మరియు స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ హీరోయిన్ గా నటించనుంది. ఇప్పటికే కథాచర్చలు పూర్తి అయినట్లుగా తమిళ సినిమా వర్గాల నుండి సమాచారం అందుతోంది. ఇక ఈ సినిమాలో మరో విశేషం ఏమిటంటే … లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రహమాన్ తనయుడు అమీన్ సంగీతాన్ని అందించనున్నాడు.