వచ్చే ఫిబ్రవరిలో మరోసారి డీఎస్సీ నోటిఫికేషన్..

-

తెలంగాణలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీకి మరోసారి డీఎస్సీ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేసే ఆస్కారం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి ఇప్పటికే విద్యాశాఖకు రాష్ట్ర సర్కార్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.ఇప్పటికే అధికారులు ఆ ఏర్పాట్లలో నిమగ్నమైనట్లు సమాచారం.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ మేరకు ఈ పోస్టులను భర్తీ చేయానలి చూస్తోంది.

డీఎస్సీ-2023లో భాగంగా ప్రభుత్వం 11,062 టీచర్ పోస్టులను భర్తీ చేయాలని భావించింది. ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే ఫిబ్రవరిలో మరో నోటిఫికేషన్‌కు సర్కార్ సిద్ధమవడం గమనార్హం. కాగా, డీఎస్సీ-2023కి సంబంధించి ప్రిలిమినరీ కీని విద్యాశాఖ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. త్వరలోనే ఫైనల్ కీతో పాటు జీఆర్ఎల్ కూడా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం 1:30 టీచర్-విద్యార్థుల రేషియో ఉండాల్సి ఉండగా, తెలంగాణలో మాత్రం 1:16 నిష్పత్తిలో ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version