ప్రకాశం జిల్లా ఒంగోలులో బాలినేని ఫ్లెక్సీల చించివేత కలకలం రేపింది. రేపు పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి. ఈ తరుణంలోనే మాజీ మంత్రి బాలినేనిని జనసేనలోకి ఆహ్వానిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే మాజీ మంత్రి బాలినేనిని జనసేనలోకి ఆహ్వానిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించి వేశారు.
దింతో ప్రకాశం జిల్లా ఒంగోలులో బాలినేని ఫ్లెక్సీల చించివేత కలకలం రేపింది. అటు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి..జనసేన పార్టీలోకి వెళ్లడాన్ని ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బాలినేని లాంటి వారిని జనసేనలో చేర్చుకోకూడదని పవన్ కళ్యాణ్ కు చెబుతానని వివరించారు ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్.