డిఎస్పీ కూడా ఉగ్రవాదే, పోలీసులు విచారణలో వెల్లడి…!

-

కాశ్మీర్‌లో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులకు సాయం చేసిన డీఎస్పీ దవీందర్ సింగ్ వ్యవహారాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. శనివారం తనిఖీల్లో భాగంగా ఇద్దరు ఉగ్రవాదులతో పాటుగా డిఎస్పీని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిఘా వర్గాల పక్కా సమాచారంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇప్పుడు అతని నుంచి కీలక విషయాలు రాబడుతున్నారు అధికారులు.

అతను కొంత కాలంగా ఉగ్రవాదులకు ఆశ్రయం కూడా కల్పిస్తున్నాడని, బాదామిబాగ్‌ కంటోన్మెంట్‌లోని ఆర్మీ XV కార్ప్స్ హెడ్‌క్వార్ట్స్ సమీపంలో ఉండే తన నివాసంలో ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చాడని విచారణలో వెల్లడైంది. డీఎస్పీ ఇంట్లో సోదాలు చేసిన పోలీసులు రెండు పిస్టల్స్, ఒక ఏకే 47 రైఫిల్, పెద్ద మొత్తంలో మందు గుండు సామాగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అవి ఉగ్రవాదులకు సంబంధించినవి గా గుర్తి౦చారు.

ఉగ్రవాదులకు సాయం చేసాడు కాబట్టి అతను కూడా ఉగ్రవాదే అని అధికారులు అంటున్నారు. శ్రీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు వద్ద యాంటీ హైజాకింగ్ స్క్వాడ్‌ విభాగంలో డిఎస్పీ గా పని చేస్తున్న దవిందర్ 2019 లో రాష్ట్రపతి అవార్డ్ కూడా అందుకున్నాడు. తన పని తీరుతో వేగంగా పైకి ఎదిగిన అతను ఈ క్రమంలోనే అనేక విమర్శలకు కూడా ఎదుర్కొన్నాడు. పార్లమెంట్ పై దాడి కేసు సమయంలో కూడా ఇతని పేరు ఎక్కువగా వినపడింది.

Read more RELATED
Recommended to you

Latest news