Union Budget 2025: నిర్మలమ్మ నోట… గురజాడ మాట వచ్చింది. దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్ అన్న గురజాడ అప్పారావు పద్యాన్ని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్మరించుకున్నారు. తాము అదే విధానంతో బడ్జెట్‌కు రూపకల్పన చేసినట్లు.. పద్దును రూపొందించినట్లు వెల్లడించారు.
రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి నిర్మలమ్మ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ధన్ ధాన్య యోజన కార్యక్రమాన్ని ప్రకటించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ పథకం ద్వారా వెనుకబడిన జిల్లాల్లో వ్యవసాయానికి ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు. గోదాములు, నీటిపారుదల, రుణ సౌకర్యాల కల్పన చేయనున్నట్లు వివరించారు. ఒక కోటీ 70 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని ప్రకటించారు.