కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని ఓడించండి – తీన్మార్ మల్లన్న

-

కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. నరేందర్ రెడ్డి దగ్గర మస్తు పైసలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిందని కాంగ్రెస్ అభ్యర్థిపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న హాట్‌ కామెంట్స్‌ చేశారు. తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి పేరు అనౌన్స్‌ చేసింది.

teenmar mallanna comments on alphores narendhar reddy

ఉమ్మడి కరీంనగర్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – మెదక్ పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ వి.నరేందర్ రెడ్డి పేరును ప్రకటించింది ఏఐసీసీ. అయితే… గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు తీన్మార్‌ మల్లన్న. అతను రెడ్డి అని… బీసీలంతా ఏకమై.. అతన్ని ఓడించాలని పిలుపునిచ్చాడు తీన్మార్‌ మల్లన్న.

Read more RELATED
Recommended to you

Latest news